గురువారం 09 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 10:39:19

టీవీ చౌదరి భౌతికకాయానికి మంత్రి పువ్వాడ నివాళులు

టీవీ చౌదరి భౌతికకాయానికి మంత్రి పువ్వాడ నివాళులు

ఖమ్మం : సీపీఐ రాష్ట్ర సీనియర్ నాయకుడు టీవీ చౌదరి నిన్న రాత్రి ఖమ్మంలో తుది శ్వాశ విడిచారు. స్థానిక మమత దవాఖాన మార్చురీలో ఉంచిన చౌదరి భౌతికకాయాన్నిరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం సందర్శించారు. వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా, సీపీఐ పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో చౌదరి పలు బాధ్యతలు నిర్వర్తించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, కార్యదర్శిగా ఆయన పని చేశారు. సుదీర్ఘకాలం పాటు సీపీఐ జిల్లా కార్యదర్శిగా సేవలందించారు. 


logo