శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 15:04:31

రైతు వేదికకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ

రైతు వేదికకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ

భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు మండలం సుదిమల్ల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు వేదిక నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాజ అజయ్‌కుమార్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలను నాటారు. వేదిక నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు అదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు, ఐటీడీఏ పీవో గౌతం, గ్రంథాలచ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo