సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 15:47:43

తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. తొలి, మలి దశ ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారులకు రెండు నిమిషాలు పాటు మౌనం పాటించి స్మారక స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. 1969 నాటి  ఉద్యమకారులను శాలువతో  సత్కారించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.