బుధవారం 27 మే 2020
Telangana - May 21, 2020 , 01:59:56

డిపోల్లో మార్గదర్శకాలు పాటించాలి

డిపోల్లో మార్గదర్శకాలు  పాటించాలి

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • కోదాడ డిపో మేనేజర్‌ సస్పెన్షన్‌కు ఆదేశం 

ఖమ్మం కమాన్‌బజార్‌: ప్రతి డిపోలో కరోనా వైరస్‌ బారినపడకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, మాస్క్‌ లేకుండా ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతించవద్దని రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆర్టీసీ ఉద్యోగులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలసి ఖమ్మంబస్టాండ్‌ను మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. బస్టాండ్‌ ఆవరణలో ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి డిపోలో కండక్టర్‌కు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఇవ్వాలని, ప్రయాణికులకు హ్యాండ్‌ శానిటైజ్‌, మాస్క్‌ ధరించడం,  సిట్టింగ్‌లోనూ భౌతికదూరం పాటించాలని అధికారులను ఆదేశించారు. కండక్టర్‌కు శానిటైజర్‌ ఇవ్వని సూర్యాపేట జిల్లా కోదాడ డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. 


logo