శనివారం 06 జూన్ 2020
Telangana - May 23, 2020 , 22:31:49

రైతులను సంఘటితం చేయడమే ప్రభుత్వ ధ్యేయం

రైతులను సంఘటితం చేయడమే ప్రభుత్వ ధ్యేయం

రఘునాథపాలెం : రైతులందరినీ సంఘటితం చేసి నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానాన్ని అవలభించేలా కేసీఆర్‌ సర్కార్‌ వ్యవసాయంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రైతుసోదరులు ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలన్నారు. వానకాలంలో సాగు చేసే పంటలపై ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో ఏర్పాటు చేసిన రైతులకు అవగాహనా సదస్సులను మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. 

ముందుగా రైతులతో నియంత్రిత పద్దతిలోనే పంటలను సాగు చేయాలని మంత్రి స్వయంగా రైతు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులకు చేపట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుబంధు వేధికలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3వేల క్లస్టర్లలో ఏ రైతు ఏ పంట సాగు చేశాడో సులువుగా తెలుస్తుందన్నారు.

 రైతాంగాన్ని సంఘటితం చేయడంలో రైతుబంధు కమిటీలు కీలక భూమిక పోషించాలన్నారు. సదస్సులో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు. logo