శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:46:57

రైతు కండ్లలో ఆనందం

రైతు కండ్లలో ఆనందం
  • మండలిలో చీఫ్‌ విప్‌ బీ వెంకటేశ్వర్లు
  • గవర్నర్‌ ప్రసంగంపై కొనసాగిన చర్చ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి పాలనలో లేనివిధంగా రాష్ట్రంలో రైతుల కండ్లలో ఆనందం కనిపిస్తున్నదని శాసనమండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై శనివారం మండలిలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యుడు భానుప్రసాద్‌ బలపరిచారు. దీనిపై జరిగిన చర్చలో బోడకుంటి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతుబీమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయని  చెప్పారు. మిషన్‌ భగీరథ పథకాన్ని 11 రాష్ట్రాల ప్రతినిధులు అధ్యయనం చేసి అభినందించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు నిండి సాగువిస్తీర్ణం పెరిగిందన్నారు. 24 గంటల విద్యుత్‌సరఫరా, సబ్బండవర్ణాలకు సంక్షేమపథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. చర్చలో సభ్యులు భానుప్రసాద్‌, రాంచందర్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, యెగ్గే మల్లేశం, జాఫ్రీ, జీవన్‌రెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు. 


పాసింగ్‌ కామెంట్స్‌ మంచిది కాదు: మంత్రి పువ్వాడ అజయ్‌ 

గవర్నర్‌ ప్రసంగంపై కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి చేసిన వాఖ్యలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖండించారు. పాసింగ్‌ కామెంట్స్‌ చేయడాన్ని తప్పుబట్టారు. జగిత్యాలలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత జీవన్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.


logo