ఆదివారం 31 మే 2020
Telangana - May 10, 2020 , 16:17:37

10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ

10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ

సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా మున్సిపల్‌శాఖ చేపట్టిన ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. తన నివాస సముదాయంలో దోమల నివారణ కార్యక్రమాలను చేపట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలు, తొట్టీలలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. దోమలు నివాసం ఉండే ప్రాంతాలు కుండీలు, వాటర్‌ ట్యాంక్‌లు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు తదితర వాటిని గుర్తించి వాటిని తొలగించాలన్నారు. ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యాల్ని కాపాడుకోవాల్సిందిగా పేర్కొన్నారు.logo