శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:55:19

టీవీ రావు సేవలు మరువలేం

టీవీ రావు సేవలు మరువలేం

  • సంతాపసభలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌ ఆర్టీసీ ఈడీ (పరిపాలన-ఆరోగ్యం) టీవీ రావు ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోయామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సంస్థకు ఆయన సేవలు మరువలేమని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఏర్పాటుచేసిన సంతాపసభలో టీవీ రావు చిత్రపటానికి మంత్రి పువ్వాడ పూలమాల వేసి నివాళులర్పించారు. రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, ఇతర అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. టీవీ రావు డిపోమేనేజర్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత బాధ్యతలు చేపట్టి ఆర్టీసీకి విశేష సేవలు అందించారని స్మరించుకున్నారు. సంస్థ పురోగతికి పరితపించిన వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని చెప్పారు. ఆయనకు ఆత్మకు శాంతిచేకూరాలని కోరుతూ.. టీవీ రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.logo