మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 01:54:53

అంతర్రాష్ట్ర సర్వీసులపై త్వరలో నిర్ణయం

అంతర్రాష్ట్ర సర్వీసులపై త్వరలో నిర్ణయం

  • ఈ విషయమై పొరుగు రాష్ర్టాలకు లేఖ రాశాం
  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాలకు లేఖ రాసినట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాధాన్యతాక్రమంలో కిలోమీటర్‌ ప్రాతిపదికన సర్వీసులపై నిర్ణయం తీసుకొనేందుకు అధికారులను నియమించాలని కోరినట్టు చెప్పారు. ఆయా రాష్ర్టాల నుంచి అధికారులు వస్తే, మన రాష్ట్ర అధికారులు చర్చిస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు రాష్ర్టాల నుంచి తమ లేఖపై ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదని తెలిపారు. కాగా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై త్వరలో తెలంగాణ రవాణాశాఖతో మాట్లాడుతానని ఏపీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. లేక్‌వ్యూ అతిథిగృహంలో శనివారం మీడియా సమావేశంలో ఈ అంశంపై నాని మాట్లాడారు. సోమవారం తెలంగాణ మంత్రితో ఫోన్‌లో సంప్రదిస్తానన్నారు. తాము తెలంగాణ మంత్రి, అధికారులను విజయవాడకు ఆహ్వానించాలని అనుకుంటున్నామని, మంత్రి పువ్వాడతో మాట్లాడిన తర్వాత ఎక్కడ సమావేశమవ్వాలనే దానిపై స్పష్టత వస్తుందని తెలిపారు.


logo