శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 24, 2020 , 14:16:18

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రక్తదానం

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రక్తదానం

హైద‌రాబాద్ : రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రివర్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు జ‌న్మ‌దినం నేడు.  ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని న‌గ‌రంలోని యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ర‌క్త‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫ‌సియుద్దీన్‌, స్థానిక ప్రజాప్రనిధులు పాల్గొన్నారు. logo