బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 11:18:43

నాడు హారతులు పట్టిన నేతలే.. నేడు దీక్షలు చేస్తున్నారు..

నాడు హారతులు పట్టిన నేతలే.. నేడు దీక్షలు చేస్తున్నారు..

ఖమ్మం : కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ నిప్పులు చెరిగారు. నాడు పోతిరెడ్డిపాడుకు హారతులు పట్టిన నేతలే నేడు దీక్షలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. పోతిరెడ్డిపాడుపై జగన్‌ తలపెట్టిన ఎత్తిపోతల నిర్మాణం జరిగేది కాదన్నారు. వైఎస్‌ హయాంలోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును కేసీఆర్‌ వ్యతిరేకించారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని వైఎస్‌ పెంచుతున్నప్పుడు ఈ కాంగ్రెస్‌ నాయకులు నోరెత్తలేదు అని అన్నారు.

ఉమ్మడి ఏపీలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రులు ఆంధ్ర ప్రాంతానికి న్యాయం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటుంటే కళ్లున్న కాబోదుల్లా చూశారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఏపీ నిర్ణయం వల్ల దక్షిణ తెలంగాణలోని సుమారు 5 జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ జిల్లాకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరించవచ్చు అని మంత్రి తెలిపారు. 


logo