గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 02:04:56

కొవిడ్‌ బాధితులకు సర్కారు అండ

కొవిడ్‌ బాధితులకు సర్కారు అండ

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. కరోనా బారినపడి ఇంట్లోనే చికిత్సపొందుతున్న వారికి ప్రభుత్వం కరోనా వ్యాధి నిర్ధారణ (ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్‌), హోం ఐసోలేషన్‌ కిట్లను మంగళవారం మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని చెప్పారు.  ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, మేయర్‌ పాపాలాల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి పాల్గొన్నారు. logo