సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 15:34:16

కరోనాను జయించిన మంత్రి పువ్వాడ

కరోనాను జయించిన మంత్రి పువ్వాడ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అజయ్ కుమార్ కరోనాను సమర్ధవంతంగా జయించారు. ఈనెల 14వ తేదీన నిర్వ‌హించిన కొవిడ్ టెస్టులో ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  

14వ తేదీ నుంచి బంజారాహిల్స్‌లోని మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్‌లో హోం ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స పొందారు. డాక్ట‌ర్ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను అజ‌య్ పాటించి క‌రోనా బారి నుంచి త‌ప్పించుకున్నారు. కరోనా సోకిందన్న విషయం తెలియగానే పువ్వాడ‌ అభిమానులు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. తాజాగా శ‌నివారం నిర్వ‌హించిన కోవిడ్ టెస్ట్(RT PCR)లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. కరోనా నెగటివ్ అని తేలడంతో.. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. 


అభిమానం మ‌రిచిపోలేనిది..

కరోనా మహమ్మారిని జయించాడానికి త‌న‌కు ధైర్యం ఇచ్చింది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే అని మంత్రి పువ్వాడ‌ పేర్కొన్నారు. త‌న‌ మీద మీకు ఉన్న ప్రేమ, అభిమానమే త‌న‌ను మళ్ళీ మీ మధ్యలోకి  తీసుకొచ్చిందని స్పష్టం చేశారు.  పూర్తిగా కొలుకున్నానని, సోమవారం నుండి తిరిగి విధులకు హాజ‌రు అవుతాన‌ని ట్విట్టర్ అకౌంట్ ద్వారా మంత్రి అజ‌య్ వెల్ల‌డించారు.  logo