బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 14:39:49

ర‌వాణా శాఖ మంత్రుల భేటీ లేదు : మ‌ంత్రి పువ్వాడ‌

ర‌వాణా శాఖ మంత్రుల భేటీ లేదు : మ‌ంత్రి పువ్వాడ‌

హైద‌రాబాద్ : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల ర‌వాణా శాఖ మంత్రులు సోమ‌వారం స‌మావేశ‌మ‌వుతార‌ని వ‌చ్చిన వార్త‌ల‌పై రాష్ర్ట ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ స్పందించారు. అంత‌ర్ రాష్ర్ట‌ బ‌స్సు స‌ర్వీసుల అంశంపై ఎలాంటి మంత్రుల స్థాయి స‌మావేశం లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఏపీ ర‌వాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక భేటీ నిర్ణ‌యం కాలేద‌ని చెప్పారు. కిలోమీట‌ర్ బేసిస్‌లో అధికారుల ఒప్పందం త‌ర్వాతే మంత్రుల స్థాయి స‌మావేశం ఉంటుంద‌న్నారు. అధికారుల స్థాయి స‌మావేశాలు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ పేర్కొన్నారు.


logo