మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 20:34:15

ప‌త్తి చేనులో గుంటుక తోలిన మంత్రి పువ్వాడ‌

ప‌త్తి చేనులో గుంటుక తోలిన మంత్రి పువ్వాడ‌

ఖ‌మ్మం : రఘునాథ‌పాలెం మండలం మంచుకొండ గ్రామంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ‌నివారం ప‌త్తి చేనులో స‌ర‌దాగా గుంటుక తోలారు. అనంతరం మంత్రి రైతులతో మాట్లాడారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అందుతున్నాయో లేదోన‌ని అడిగి తెలుసుకొని, ఏ ఇబ్బంది ఉన్నా త‌న దృష్టికి తీసుకు రావాల‌ని సూచించారు. ఏపుగా పెరిగిన పత్తి చేలను చూసి ఆయ‌న‌ త‌న్మ‌య‌త్వం పొందారు. 14 ఏండ్ల తమ కల సాకారమైందని, ఎన్నడూ లేని విధంగా పంటలు సకాలంలో వేసుకోగలుగుతున్నామ‌ని రైతులు మంత్రితో అన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo