సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 16:38:58

సాగర్ జలాల పంపిణీ పై మంత్రి పువ్వాడ సమీక్ష

సాగర్ జలాల పంపిణీ పై మంత్రి పువ్వాడ సమీక్ష

ఖమ్మం : జిల్లా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో టీటీడీపీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు కింద సాగుఅవుతున్న పంటలకు నీటి పంపిణీ పై చర్చించారు. వానకాలానికి సరిపడా సాగునీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , రాములు నాయక్  విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు జిల్లా కోఆర్డినటర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎన్ఎస్పీ, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.


logo