మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 16:32:47

కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణ పనుల పరిశీలన

కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణ పనుల పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని కొత్తగూడెం ఎల్ఐసీ ఆఫీస్ వద్ద గల నిర్మాణంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సందర్శించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.