శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 21:44:16

సీపీఐ నారాయణపై మంత్రి పువ్వాడ ఫైర్..

సీపీఐ నారాయణపై మంత్రి పువ్వాడ ఫైర్..

ఖమ్మం : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మంత్రి పువ్వాడ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని సమర్థిస్తూ మంత్రి మంత్రివర్గం నుంచి పువ్వాడను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన నారాయణపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఖమ్మంలో విలేకరులతో మంత్రి మాట్లాడారు. ‘నారాయణవి ఆది నుంచి నీచ రాజకీయాలే. సీపీఐని 99 ఛానల్‌ను అమ్ముకొని పార్టీని సున్నాకి తెచ్చారు. ఏ పార్టీలోఉన్నా ప్రజలే నన్ను గెలిపుంచారు. నువ్వెప్పుడైనా ప్రజల నుంచి గెలిచావా. ? నీ జాతకం మొత్తం నేను నొరు విప్పితే బజారు పాలవుతుంది.

మా నాన్న నాగేశ్వర్‌రావు దగ్గర నుంచి సాయం పొంది ఆయన్ను దెబ్బశావు. 2006లో పార్టీకి మెజారిటీ ఉన్నా ఆయన్ను రాజ్యసభకు పోకుండా అడ్డుకున్నావ్‌. 2009 లో ఖమ్మం ఎంపీ మహాకూటమి అభర్థిగా నాగేశ్వర్‌రావును ప్రకటిస్తే చంద్రబాబు వద్ద రూ. 4 కోట్లు తీసుకొని సీటు అమ్ముకున్నావ్‌. 2011లో ఎమ్మెల్సీని కానివ్వకుండా అడ్డుకున్నవ్. నీ నీచ రాజకీయ బతుకుని ఎండగడతా. 2018 ఎన్నికల్లో ఖమ్మం వచ్చి నన్ను ఒడిచమన్నవ్. ప్రజలు గెలిపించారు. సీఎం కేసీఆర్‌ నాకు మంత్రి పదవి ఇస్తే నీకెందుకు భయం. ఖబడ్దార్ నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే కేసీఆర్‌ వదిలేసిన నీ చెవ్వు తెగుద్ది’ అని మంత్రి పువ్వాడ హెచ్చరించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.