శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 08:59:02

'మాచిల్' వీరుడికి నివాళుల‌ర్పించిన మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి

'మాచిల్' వీరుడికి నివాళుల‌ర్పించిన మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి

నిజామాబాద్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని మాచిల్ సెక్టార్‌లో నిన్న జ‌రిగిన ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించిన సైనికుడు రాడ్యా మ‌హేశ్‌కు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. భార‌తావ‌ని కోసం మ‌హేశ్ చేసిన త్యాగం మ‌రువ‌లేనిద‌ని అన్నారు. అమ‌ర సైనికుడికి యావ‌త్ తెలంగాణ నివాళుల‌ర్పిస్తున్న‌ద‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం కేసీఆర్, వేల్పూర్ వాసిగా తాను మ‌హేశ్ కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. మ‌హేశ్‌తోపాటు వీర‌మ‌ర‌ణం పొందిన సైనికుల‌కు జోహర్లు అ‌ర్పించారు. 

జ‌మ్ముక‌శ్మీర్‌లోని  మాచిల్ సెక్టార్‌లో ఆదివారం తెల్ల‌వారుజామున‌ జ‌రిగిన ఉగ్ర‌దాడిలో భార‌త సైన్యానికి చెందిన ఇద్ద‌రు జ‌వాన్ల‌తోపాటు, ఓ సైనికాధికారి, బీఎస్ఎఫ్ జ‌వాన్ వీర‌మ‌ర‌ణం పొందారు. వారిలో రాష్ట్రానికి చెందిన రాడ్యా మ‌హేశ్ కూడా ఉన్నారు. మ‌హేశ్ స్వ‌స్థ‌లం నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండ‌లం కోమ‌న్‌ప‌ల్లి. మ‌హేశ్ 2014-15లో సైన్యంలో చేరారు. ఆయ‌న‌ గ‌త డిసెంబ‌ర్‌లో కోమన్‌‌ప‌ల్లికి వ‌చ్చివెళ్లారు. ఉగ్ర‌వాదుల దాడిలో మ‌హేశ్ మ‌రణించ‌డంతో గ్రామంలో విషాద ఛాయ‌లు అలు‌ముకున్నాయి.