గురువారం 28 మే 2020
Telangana - May 04, 2020 , 00:52:22

అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు

అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు

  • ధాన్యం సేకరణపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్ష    

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ధాన్యం సేకరణలో అవకతవకలకు పాల్పడే వారితోపాటు రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు తప్పవని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం సేకరణపై ఆదివారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీచైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, షకీల్‌, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌ గుప్తా, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. logo