శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 11:27:23

23 చెక్‌డ్యాంలతో 40 వేల ఎకరాలకు నీళ్లు

23 చెక్‌డ్యాంలతో 40 వేల ఎకరాలకు నీళ్లు

నిజామాబాద్‌: జిల్లాలోని వేల్పూరు మండలం కప్పలవాగు, పెద్దవాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు తొమ్మిది చెక్‌డ్యాంల నిర్మాణాలను పూర్తిచేశామని, తాజాగా మరో మూడు చెక్‌డ్యాంలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. కరోనా వైరస్‌ వల్ల చెక్‌డ్యాంల నిర్మాణాలు మూడు నెలలు ఆలస్యమయ్యిందని వెల్లడించారు. 45 కి.మీ. మేర 23 చెక్‌డ్యాంలను నిర్మించనున్నామని, వీటివల్ల 40 వేల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి అన్ని చెక్‌డ్యాంల నిర్మాణాలను పూర్తిచేస్తామని చెప్పారు.


logo