శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 15:25:03

కేసీఆర్ చేత‌ల సీఎం : మ‌ంత్రి ప్ర‌శాంత్ రెడ్డి

కేసీఆర్ చేత‌ల సీఎం : మ‌ంత్రి ప్ర‌శాంత్ రెడ్డి

నిజామాబాద్ : నిజామాబాద్ : జిల్లా ‌ప‌రిధిలోని ఇందల్వాయి మండలం దేవితండా సేవాలాల్ ఆలయ 8వ‌ వార్షికోత్సవం, రాజగోపురం ప్రతిష్టాపన‌ మహోత్సవం అత్యంత వైభ‌వోపేతంగా జ‌రిగింది. ఈ మ‌హోత్స‌వంలో మంత్రులు  సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, నిజామాబాద్ జ‌డ్పీ ఛైర్మన్ దాదన్నగరి విట్టల్ రావ్, నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్ , జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోటి ఎక‌రాల మాగాణం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని, ఆ క‌ల నెర‌వేరే వ‌ర‌కు ఆయ‌న విశ్ర‌మించ‌ర‌ని తెలిపారు. కేసీఆర్ మాట‌లు చెప్పే నేత కాదు.. చేత‌లు చేసి చూపించే సీఎం అని స్ప‌ష్టం చేశారు. రాజగోపురం ప్రారంభం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు, గిరిజన బిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. గోపురం నిర్మాణానికి రూ. 50 లక్షలు ఇచ్చిన మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. సేవ‌లాల్ మ‌హారాజ్ జ‌యంతిని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంద‌న్నారు. తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్దిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. ఈ రోజు తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా.. వాటి అభివృద్ధికి పుష్క‌ల‌మైన నిధులు ఇస్తున్నార‌ని గుర్తు చేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి బంజారా భవన్ కోసం కూడా కృషి చేస్తాను అని స్ప‌ష్టం చేశారు. ప్యాకేజీ 21 ద్వారా ల‌క్షా 20 వేల ఎక‌రాల‌కు సాగునీరు ఇవ్వ‌బోతున్నామ‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు.