మంగళవారం 02 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 09:09:53

యువకుడి ఔదార్యం..మంత్రి కేటీఆర్‌ అభినందనలు

యువకుడి ఔదార్యం..మంత్రి కేటీఆర్‌ అభినందనలు

హైదరాబాద్ : కరోనా మహమ్మారిపై యుద్దం చేసేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు. కరోనాపై పోరాటాని నా వంతు ప్రయత్నం అంటూ..శ్రీకాంత్‌ శరవన్‌ అనే యువకుడు సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.50 వేలు అందించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌తో చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకున్న తాను ప్రజలకోసం కొంత సాయం అందించానని మంత్రి కేటీఆర్‌కు శ్రీకాంత్‌ ట్వీట్‌చేశారు.

ప్రభుత్వ రుణం తీర్చుకొనే అవకాశం లభించిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌..సాయమందించినందుకు శ్రీకాంత్‌ను అభినందించారు. ఓవర్సీస్‌ పథకం పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉన్నదని చెప్పారు. logo