సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 03:00:14

పెండింగ్‌ నిధులు విడుదల చేయండి

పెండింగ్‌ నిధులు విడుదల చేయండి

  • కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి లేఖ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర కార్మికశాఖ నుంచి తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులను విడుదల చేయాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి లేఖ రాశారు. శనివారం ఈ లేఖను టీఆర్‌ఎస్‌ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వర్‌రావుకు టీఆర్‌ఎస్‌ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అందజేశారు. తెలంగాణకు గత ఏడాదికి సంబంధించి రూ.147.37 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి విడత రూ. 35.45 కోట్లు విడుదల చేసేలా కృషి చేయాలని నామాను కోరారు. 


logo