మంగళవారం 07 జూలై 2020
Telangana - May 30, 2020 , 15:33:51

అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇండ్లు: నిరంజన్‌రెడ్డి

అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇండ్లు: నిరంజన్‌రెడ్డి

వనపర్తి: ప్రభుత్వం నిర్మించే డబుల్‌ బెడ్రూం ఇండ్లను అర్హులకే కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. వనపర్తి  సమీపంలోని గ్రామాల్లో నిర్మితమతున్న డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఆయన పరిశీలించారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు. లబ్దిదారులను త్వరలోనే ఎంపికచేస్తామని చెప్పారు. రోడ్ల విస్తరణలో నిరాశ్రయులైన పేదలకు ప్రాధాన్యమిస్తామన్నారు. సొంత స్థలాలున్న వారికి ఇండ్లు నిర్మించుకునేందకు సహాయం చేస్తామని తెలిపారు. పెద్దగూడెం చౌరస్తాలో 296, అప్పాయపల్లి శివారులో 160, చిట్యాల సమీపంలో 760 ఇండ్లు నిర్మితమవుతున్నాయని చెప్పారు. మొత్తం 1400 ఇండ్లను విడతలవారీగా పంపిణీ చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన కలెక్టర్‌ను ఆదేశించారు. వీటితోపాటు పట్టణంలోని పీర్లగుట్ట, రామాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం మరో రెండు వేల గృహాలను త్వరలోనే మంజురు చేయిస్తానన్నారు.


logo