శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 20:13:55

లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న మంత్రి నిరంజన్‌ రెడ్డి

లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న మంత్రి నిరంజన్‌ రెడ్డి

యాదాద్రి భువనగిరి/ వనపర్తి  : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనాలతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు ఆయన వెల్లడించారు.

అంబర్ పేట ప్రజలకు కృతజ్ఞతలు..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అంబర్‌ పేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను ఆదరించిన ఓటర్లకు మంత్రి నిరంజన్‌ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు.  ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తాం.  ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. హైదరాబాద్‌ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషిచేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు  మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 


logo