సోమవారం 25 మే 2020
Telangana - Mar 31, 2020 , 18:41:29

ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వం: మంత్రి నిరంజన్‌రెడ్డి

ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వం: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ కూరగాయల మార్కెట్‌ను తాత్కాలికంగా సరూర్‌నగర్‌లోని స్టేడియంలోకి తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్  క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసి తగు ఏర్పాట్లకు సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, పలు ఖాళీ ప్రదేశాలకు కూరగాయల మార్కెట్లు తరలిస్తున్నాం కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేస్తుస్తున్నాం కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలి.  మొబైల్ రైతుబజార్ల ద్వారా వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలకు తక్కువ ధరకు తాజా కూరగాయలు అందిస్తున్నాం.  ఆయా అపార్ట్ మెంట్లు, కాలనీ వాసుల నుండి గత నాలుగు రోజులుగా మంచి స్పందన లభిస్తుంది.

కూరగాయలు కావాల్సిన కాలనీ, అపార్ట్ మెంట్ల వాసులు 7330733212 నంబరుకు కాల్ చేసి నమోదు చేసుకుంటే వాహనం వచ్చే సమయం చెబుతారు .. మొబైల్ రైతుబజార్ నడపాలనుకుంటున్న యువకులు, ఇతరులు కూడా ఈ నంబరును సంప్రదించవచ్చు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రానికి వలస వచ్చిన కూలీలను కూడా వారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న వారు..  వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం అని వారికి వసతి కల్పిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనాను ఎదుర్కొనే విషయంలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకున్నాం. ఈ పరిస్థితుల నుండి బయటపడేందుక ప్రజల సహకారం సంపూర్ణంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 


logo