ఆదివారం 23 ఫిబ్రవరి 2020
గ్రామాల అభ్యున్నతికి పకడ్బందీ ప్రణాళిక : మంత్రి నిరంజన్‌ రెడ్డి

గ్రామాల అభ్యున్నతికి పకడ్బందీ ప్రణాళిక : మంత్రి నిరంజన్‌ రెడ్డి

Feb 15, 2020 , 12:45:03
PRINT
గ్రామాల అభ్యున్నతికి పకడ్బందీ ప్రణాళిక : మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గ్రామాల అభ్యున్నతికి పకడ్బందీ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పట్టుదలగా పని చేయాలి. ప్రజలను పల్లెప్రగతిలో భాగస్వాములను చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అందరి భాగస్వామ్యంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామవికాసం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. మొక్కల పెంపకం ఉద్యమంలా సాగాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. ఈ నెల 20న వనపర్తి జిల్లాలో, 21న జోగులాంబ గద్వాల, 23న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నిర్వహించే పంచాయతీ సమ్మేళనాలకు మంత్రి నిరంజన్‌ రెడ్డి హాజరుకానున్నారు. 


logo