శనివారం 30 మే 2020
Telangana - Apr 10, 2020 , 11:57:32

పండించిన ప్రతీ గింజను కొంటాం...

పండించిన ప్రతీ గింజను కొంటాం...

వనపర్తి: జిల్లాలోని పాన్‌గల్‌ మండల కేంద్రంతో పాటు జమ్మాపూర్‌ గ్రామంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. మంత్రి  వెంట స్థానిక లోక్‌సభ సభ్యులు పోతుగంటి రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ తదితరలు ఉన్నారు. గ్రామంలో సోడియం హైపోబైకార్బోనేట్‌ ద్రావణం పిచికారి చేశారు. గోప్లాపూర్‌, దవాజీపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లకుండా ప్రభుత్వానికి సహకరించాలి. రైతులు తమ ధాన్యంను కోసిన వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇచ్చి టోకెన్లు తీసుకోవాలి. ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలని కోరారు.


logo