సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:12:21

నూతన నీటి యాజమాన్య పద్ధతులు

నూతన నీటి యాజమాన్య పద్ధతులు
  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: వరిసాగులో నూతన నీటి యాజమాన్య పద్ధతులను అవలంబిస్తున్నట్టు వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. కిలో వరిసాగుకు 2,395 లీటర్ల నీటిని వినియోగిస్తున్నట్టు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సగటున 2,300 లీట ర్లు.. దేశంలోని వివిధరాష్ట్రాలలో 1,786 లీటర్ల నుంచి 3,683 లీటర్ల వరకు వినియోగిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ వ్యవసాయవర్సిటీ వరిసాగులో నీటివినియోగం తగ్గించేందుకు శాస్త్రీయ నీటిపద్ధతులను ఆవిష్కరించి ప్రదర్శనలు నిర్వహించారన్నారు.


logo