మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:57:49

ఉత్పత్తుల మేరకు గోదాములు

ఉత్పత్తుల మేరకు గోదాములు

  • మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పంట ఉత్పత్తులకు అనుగుణంగా గోదాములను నిర్మిస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ముందుచూపుతో వ్యవసాయరంగ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వసామర్థ్యం ఉన్నదని చెప్పారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. నియోజకవర్గానికో శీతల గిడ్డంగి తెస్తామన్నారు.


logo