శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 19, 2020 , 16:46:38

ప‌త్తి కొనుగోళ్ల‌పై చ‌ర్చ‌.. ధ‌ర‌లు నిర్ణ‌యం

ప‌త్తి కొనుగోళ్ల‌పై చ‌ర్చ‌.. ధ‌ర‌లు నిర్ణ‌యం

హైద‌రాబాద్ : రాష్ర్టంలో ప‌త్తి కొనుగోళ్ల‌పై అధికారుల‌తో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఖ‌రీఫ్ సీజ‌న్ దృష్ట్యా ప‌త్తి కొనుగోలు కేంద్రాలు, నాణ్య‌త ప్ర‌మాణాలతో పాటు రైతుల‌కు న‌గ‌దు చెల్లింపులు, మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై విస్తృతంగా చ‌ర్చించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప‌త్తి కొనుగోళ్ల‌కు సంబంధించి జిల్లాకు ఒక కాల్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. రైతుల ఫిర్యాదులు, సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించాల‌న్నారు. మిల్ల‌ర్లు వెంట‌నే సీసీఐతో ఒప్పందం చేసుకోవాల‌ని మంత్రి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వ‌ద్ద ప‌త్తి త‌డిచే ప‌రిస్థితి ఉండ‌కూడ‌ద‌న్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీసీఐ సిద్ధంగా ఉంద‌ని పేర్కొన్నారు. 300 జిన్నింగ్ మిల్లులు, 9 మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి నిరంజ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. 

నిర్ణ‌యించిన ప‌త్తి ధ‌ర‌లు ఇవే..

  • 8 శాతం తేమ ఉన్న ప‌త్తి క్వింటాల్ ధ‌ర రూ. 5,825
  • 9 శాతం తేమ ఉన్న ప‌త్తి క్వింటాల్ ధ‌ర రూ. 5,766
  • 10 శాతం తేమ ఉన్న ప‌త్తి క్వింటాల్ ధ‌ర రూ. 5,708
  • 11 శాతం తేమ ఉన్న ప‌త్తి క్వింటాల్ ధ‌ర రూ. 5,650
  • 12 శాతం తేమ ఉన్న ప‌త్తి క్వింటాల్ ధ‌ర రూ. 5,582