గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 04, 2020 , 17:17:02

యాసంగి కాలానికి విత్త‌నాల‌ను సేక‌రించాలి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

యాసంగి కాలానికి విత్త‌నాల‌ను సేక‌రించాలి : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో ఆ శాఖ‌ మంత్రి నిరంజ‌న్ రెడ్డి శుక్ర‌వారం స‌మావేశం అయ్యారు. స‌మావేశంలో రాబోయే యాసంగి సీజ‌న్ స‌న్న‌ద్ధ‌త‌, విత్త‌న సేక‌ర‌ణ‌, ల‌భ్య‌త‌పై విస్తృతంగా చ‌ర్చించారు. యాసంగి విత్త‌న సేక‌ర‌ణ‌పై దృష్టి సారించాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. గ‌త యాసంగి క‌న్నా ఈ ఏడాది పెద్ద ఎత్తున సాగు పెరుగుతోందని మంత్రి తెలిపారు. వేరుశ‌న‌గ‌, ప‌ప్పుశ‌న‌గ‌, వ‌రి విత్త‌నాల సేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. విత్త‌న స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య‌లు లేకుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఈ నెల‌లోనే యాసంగి విత్త‌నాలు సిద్ధంగా ఉంచాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం 50 వేల క్వింటాళ్ల వేరుశ‌న‌గ విత్త‌నాలు, 73 వేల క్వింటాళ్ల ప‌ప్పు శ‌న‌గ విత్త‌నాలు సిద్ధంగా ఉన్నాయ‌మ‌ని మంత్రి తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo