గురువారం 02 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 01:07:50

ప్రతి రైతు అభివృద్ధి చెందాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి

ప్రతి రైతు అభివృద్ధి చెందాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి

పెద్దమందడి: ప్రతి రైతు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల, వెల్టూరు, పెద్దమందడి, మనిగిల్ల, పామిరెడ్డిపల్లి, బలిజపల్లిలో రైతువేదిక భవన నిర్మాణాలకు కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. మోజర్ల కెనాల్‌ నుంచి వెల్టూరు చెరువు కోసం రూ.2.45 కోట్లతో ఏర్పాటుచేస్తున్న అప్రోచ్‌ కెనాల్‌ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సమస్యల సాధనకు రైతువేదికలు ఉపయోగపడతాయని చెప్పారు. అంతకుముందు మదనాపురం మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.


logo