శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 17:04:55

'అగ్రి' బిల్లుల‌పై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అసంతృప్తి

'అగ్రి' బిల్లుల‌పై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అసంతృప్తి

హైద‌రాబాద్ : కేంద్ర వ్య‌వ‌సాయ‌, విద్యుత్ బిల్లుల‌పై రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ర్టాల‌కు స‌మాచారం లేకుండా బిల్లులు తేవ‌డం స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. కార్పొరేట్ల‌కు ల‌బ్ది చేకూరేలా ఈ బిల్లుల‌ను కేంద్రం తెచ్చింది. రైతు ఉత్ప‌త్తుల‌పై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ లేక‌పోతే భ‌విష్య‌త్‌లో కార్పొరేట్ల గుత్తాధిప‌త్యంతో ధ‌ర‌లు పెరుగుతాయ‌న్నారు. కార్పొరేట్లు, రైతుల‌కు వివాదాలు త‌లెత్తితే ప‌రిష్క‌రించేదెవ‌రు? వివాదాలు వ‌స్తే సాధార‌ణ రైతు బ‌డా కార్పొరేట్ వ్య‌వ‌స్థ‌తో పోరాడ‌గ‌ల‌డా? అని ప్ర‌శ్నించారు.

కొత్త బిల్లుల‌తో మార్కెట్ క‌మిటీలు అలంకార ప్రాయంగా మార‌నున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం బిల్లుల‌ను ఆమోదించింది. లాభాపేక్ష త‌ప్పా.. ఎటువంటి మాన‌వ‌త్వం ఉండ‌ని విదేశీ బ‌హుళ‌జాతి కంపెనీలు.. గ్రామీణ పేద రైతాంగంపై ఎగ‌బ‌డేందుకు ఈ బిల్లులు అవ‌కాశం క‌ల్పిస్తాయ‌న్నారు. బిల్లుల్లో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర గురించి ప్ర‌స్తావ‌నే లేద‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. 


logo