బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:38:44

ఆధునిక సాగుతోనే ఆదాయం

ఆధునిక సాగుతోనే ఆదాయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్పాల్సిన ఆవశ్యకతనుగుర్తించిన సీఎం కేసీఆర్‌ తెలంగాణ రైతులను ఆధునిక వ్యవసాయంవైపు మళ్లిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మంత్రి గురువారం పుణె సమీపంలో బారామతి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బారామతి విజ్ఞానకేంద్రంలో సాగు విధానం ఎంతో బాగున్నదని కొనియాడారు. వ్యయసాయ రంగంలో కేంద్ర మాజీమంత్రి శరద్‌పవార్‌, ఆయన సోదరుడు అప్పాసాహెబ్‌ పవార్‌ మూడు దశాబ్దాలుగా చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.