మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Sep 24, 2020 , 16:05:54

ఎరువులు, విత్త‌నాల కొర‌త లేదు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

ఎరువులు, విత్త‌నాల కొర‌త లేదు : మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

వ‌న‌ప‌ర్తి : జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాల‌యంలో రైతు స‌మ‌న్వ‌య స‌మితుల ప్ర‌తినిధుల‌తో రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన నూత‌న రెవెన్యూ చ‌ట్టంతో రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గానికి సాగు నీరు అందించామ‌ని తెలిపారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గ రైతులంద‌రూ సంతోషంగా ఉన్నార‌ని చెప్పారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతుల‌కు 24 గంట‌ల ఉచిత క‌రెంట్ ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాల‌తో అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలుస్తున్నామ‌ని తెలిపారు. తెలంగాణ‌లో ఎరువులు, విత్త‌నాల‌కు కొర‌త లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. రైతులు నియంత్రిత సాగు చేప‌ట్ట‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్రిక‌ల్చ‌ర్ బిల్లుల‌ను రాష్ర్ట ప్ర‌భుత్వం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంద‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తేల్చిచెప్పారు.