శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 13:20:07

తాళ్లచెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి నిరంజన్ రెడ్డి

తాళ్లచెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : తెలంగాణలో నీలి విప్లవం ప్రభంజనం సృష్టిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలోని తాళ్లచెరువు, నల్లచెరువులలో 2.10 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధితో పాటు తెలంగాణకు ఆదాయం సమకూరుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటి పది లక్షల చేప పిల్లలు వివిధ చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేశామన్నారు. మత్స్యసంపద మత్య్సకారులకు ఆర్థిక సంపదతో పాటు తెలంగాణ ప్రజలకు ఆరోగ్య సంపదనిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఉచిత చేప పిల్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.


తాజావార్తలు