శుక్రవారం 29 మే 2020
Telangana - Jan 27, 2020 , 01:45:36

ఉద్యానపంటలవారీగా రైతు బృందాలు

ఉద్యానపంటలవారీగా రైతు బృందాలు
  • ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారులతో సమీక్షలో మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉద్యానపంటల వారీగా రైతులను బృందాలుగా ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. పంటమార్పిడికి రైతులను ప్రోత్సహించాలని.. సేంద్రియసాగుకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. ఆదివారం పబ్లిక్‌గార్డెన్స్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉద్యాన, సెరీకల్చర్‌ అధికారులతో సమీక్షించారు. పబ్లిక్‌గార్డెన్స్‌లోని పండ్లమొక్కల పెంపకాన్ని ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డితోకలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్‌, పండ్లతోటలసాగు పెంచేందుకు అధికారులు కృషిచేయాలని కోరారు. క్రాప్‌ కాలనీల్లో కూరగాయ పంటలు సాగు పెరగాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. అధిక ఆదాయం ఇచ్చే మల్బరీ, వెదురు, శ్రీగంధం సాగుపైనా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. 2021 వార్షిక ప్రణాళిక పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. పబ్లిక్‌గార్డెన్‌లో అధిక ఆక్సిజన్‌ విడుదలచేసే వెదురు తరహా మొక్కలు పెంచాలని కోరారు.


logo