శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 14:59:51

దివ్యాంగునికి మంత్రి నిరంజ‌న్ రెడ్డి చేయూత‌

దివ్యాంగునికి మంత్రి నిరంజ‌న్ రెడ్డి చేయూత‌

వ‌న‌ప‌ర్తి : జిల్లాలోని ఓ దివ్యాంగునికి రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి చేయూత అందించారు. త‌న జీతం డ‌బ్బుల‌తో త్రిచ‌క్ర వాహ‌నాన్ని కొనుగోలు చేసి అత‌నికి మంత్రి అందించారు. పెద్ద‌మంద‌డి మండ‌లం దొడ‌గుంట‌ప‌ల్లికి చెందిన సేవ‌కుల భార‌త‌మ్మ‌, కృష్ణ‌య్య‌కు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు, ముగ్గురు పిల్ల‌లు. వీరికి క్యాల్షియం లోపంతో 16 ఏళ్ల వ‌య‌సులో వైకల్యం వ‌చ్చింది. దీంతో ఆ కుటుంబానికి మంత్రి నిరంజ‌న్ రెడ్డి అండ‌గా నిలిచారు. త్రిచ‌క్ర వాహ‌నాన్ని కొనుగోలు చేసి అందించారు. అంతేకాకుండా రూ. 30 వేల చెక్కును దివ్యాంగుడు ల‌క్ష్మీనారాయ‌ణ‌కు మంత్రి అంద‌జేశారు.   

ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. మ‌న‌షుల‌కు మాత్ర‌మే వైక‌ల్యం కానీ మ‌న‌సుల‌కు కాదు అని పేర్కొన్నారు. దివ్యాంగులంద‌రికీ అంద‌రం అండ‌గా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు. దివ్యాంగుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపి.. సాధార‌ణ వ్య‌క్తుల క‌న్నా వారు త‌క్కువ కాద‌ని ప్రోత్స‌హించాలి అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచించారు. గతంలోనూ అనేక మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహన కొనుగోలుకు జీతం డబ్బుల నుంచి మంత్రి స‌హాయం చేశారు. 


logo