మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 13:30:22

అంబులెన్స్‌ను అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

అంబులెన్స్‌ను అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ‘గిఫ్ట్ ఎ స్మైల్’ లో భాగంగా స‌క‌ల స‌దుపాయాల‌తో కూడిన అంబులెన్స్ ను జిల్లా దవాఖానకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యతతో కూడిన వైద్య సేవలు, కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ వైద్యశాలలలో ప్రసవాలు పెరిగాయన్నారు. తొల్సూరు కాన్పు మాత్రమే కాదు, మల్సూరు కాన్పు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటున్నదని వివరించారు.logo