ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 12:01:51

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌ : మంత్రి నిరంజన్‌రెడ్డి

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌ : మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి జోగులాంబ : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరంలాంటిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకుంటూ ఆసరా కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారు. ఆపదలో ఉన్న సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో భరోసానిస్తుందన్నారు. ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం ఎంతగానో సహాయపడుతుందన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.