గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 16:05:16

క‌ల్యాణ‌లక్ష్మి ల‌బ్దిదారులతో మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌హ‌పంక్తి భోజ‌నం

క‌ల్యాణ‌లక్ష్మి ల‌బ్దిదారులతో మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌హ‌పంక్తి భోజ‌నం

వ‌న‌ప‌ర్తి : రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాలు నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. ప్ర‌భుత్వం ఇచ్చే న‌గ‌దుతో ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలోని ఖిల్లాఘ‌న‌పురం మండ‌లానికి చెందిన 66 మంది ల‌బ్దిదారుల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్కుల‌ను వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ల‌బ్దిదారులంద‌రికీ మంత్రి స్వ‌యంగా భోజ‌నం వ‌డ్డించి.. వారితో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్కులు అందుకున్న ల‌బ్దిదారులు తెలంగాణ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.