బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 10:30:21

'కౌలు రైతుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం కుద‌ర‌దు'

'కౌలు రైతుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం కుద‌ర‌దు'

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని కౌలుదారుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం కుద‌రదు. ఇదే విష‌యాన్ని సీఎం కేసీఆర్ అనేక సంద‌ర్భాల్లో గుర్తు చేశార‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రైతుబంధు ప‌థ‌కంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన రైతుబంధు ప‌థ‌కం కింద‌ 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 12 వేల కోట్లు, 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 12 వేల కోట్లు, 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 14 వేల కోట్లు కేటాయించిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తెలిపారు. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత వ్య‌వ‌సాయాన్ని అభివృద్ధి చేయాల‌నే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ప్ర‌తి 5 వేల ఎక‌రాల‌కు ఒక అగ్రిక‌ల్చ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ను నియ‌మించామ‌ని చెప్పారు. తెలంగాణ‌లో 2604 మంది ఏఈవోల‌ను నియ‌మించామ‌న్నారు. 2,601 రైతు వేదిక‌ల నిర్మాణానికి చ‌ర్య‌లు చేప‌ట్టాం. వీటి నిర్మాణానికి బ‌డ్జెట్‌లో కేటాయింపులు చేశామ‌న్నారు. ఈ మూడు ఆర్థిక సంవ‌త్స‌రాల్లో రైతు బీమా కింద 33,884 కుటుంబాలు ప్ర‌యోజ‌నం పొందాయి. రైతు బీమా ప్రీమియం కోసం రూ. 2,917 కోట్ల 39 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింద‌ని మంత్రి పేర్కొన్నారు. 

రైతు బంధు ప‌థ‌కాన్ని ఏ రాష్ర్టం కూడా అమ‌లు చేయ‌డం లేదు. ఈ ప‌థ‌కం కేసీఆర్ మాన‌స‌పుత్రిక‌. ప‌ట్టాదారు పాసుపుస్త‌కం క‌లిగి ఉన్న రైతు మాత్ర‌మే ఈ ప‌థ‌కానికి అర్హుడు అని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌కం కోసం ప్ర‌తి సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నామ‌ని తెలిపారు. కొవిడ్ కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌వ‌సాయ రంగాన్ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కింద చేర్చి.. రైతాంగానికి రైతుబంధు ఇచ్చామ‌న్నారు. కౌలు రైతుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం సాధ్యం కాద‌న్నారు. భూమి య‌జ‌మానికే అది కూడా సీసీఎల్ఏ ద్వారా ప‌ట్ట‌దారు పాసుపుస్త‌కం పొందిన వారికే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌న్నారు. ఇనాం భూదారుల‌కు కూడా రైతు బంధు ఇవ్వ‌లేమ‌ని చెప్పారు. క్ల‌స్ట‌ర్ల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేప‌డుతామ‌న్నారు. దీంతో ఏఈవోల నియామ‌కం కూడా స‌మాంత‌రంగా చేయాల‌ని, అందుకు ఆర్థిక శాఖ అనుమ‌తి కూడా తీసుకోవాల‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.


logo