బొడుప్పల్ మున్సిపల్ పరిధిలో హరితహారం.. పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గౌతంనగర్‌లో నిర్వహించిన హరితహారంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ జాన్ శాంసన్, మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లాలో హరితహారం ఉద్యమస్ఫూర్తితో కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8, 9 డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లు సీసా వెంకటేశ్ గౌడ్, లావణ్య శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వో రాములు, టీఆర్ఎస్ నేతలు శేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శేఖర్, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- పదవులు శాశ్వతం కాదు.. చేసిన మంచే శాశ్వతం
- దుస్తులుండి అసభ్యంగా ప్రవర్తిస్తే లైంగిక వేధింపు కాదు
- చైతన్య చేసిన పనికి ఏడ్చేసిన నిహారిక..వీడియో
- టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
- పీవీ విజ్ఞాన వేదిక డిజైన్ల ఆవిష్కరణ