శనివారం 30 మే 2020
Telangana - May 17, 2020 , 10:39:16

నిల్వ నీటిని తొలగిద్దాం... దోమలను పారదోలుదాం : మంత్రి మల్లారెడ్డి

నిల్వ నీటిని తొలగిద్దాం... దోమలను పారదోలుదాం : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ : నిల్వ నీటిని తొలగిద్దాం.. దోమలను పారదోలుదాం.. తద్వారా వ్యాధులు వ్యాపించకుండా చూద్దామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇంటి పరసరాలను స్వయంగా శుభ్రం చేశారు. నిల్వ నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కారణమౌతున్న దోమల నివారణకు మనమంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని, వీధులను, గ్రామాలను, పట్టణాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలందరూ ఇళ్లకు పరిమితమై కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సమకరించాలని కోరారు.


logo