గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 16:07:26

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ : తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని కీసర గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన చెక్‌లను మంత్రి నివాసంలో అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిరుపేద కుటుంబాలకు వరంగా మారిందన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ, కీసర మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి అంజయ్యగౌడ్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. logo