బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 21:03:04

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి గురువారం పలుచోట్ల పేదలకు బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. ముందుగా మేడ్చల్‌ మండలం పుడూర్‌ గ్రామంలో మంత్రి పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మజ, జడ్పీటీసీ శైలజ, పుడూర్‌ సర్పంచ్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో కూడా ఆప్మా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్‌, మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ శ్రీనివాస్‌, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 


logo