బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 09, 2020 , 10:21:24

పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద ప్రజలను, వలస కూలీలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. స్థానిక సదాశివ హైస్కూల్‌ ఆవరణలో బియ్యం, ఇతర నిత్యావసరాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌, జాయింట్‌ కమిషనర్‌ మమత, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

logo