గురువారం 28 మే 2020
Telangana - May 23, 2020 , 01:40:55

ఇండ్ల వద్దే రంజాన్‌ ప్రార్థనలు

ఇండ్ల వద్దే రంజాన్‌ ప్రార్థనలు

  • ముస్లింలకు మంత్రి మహమూద్‌అలీ విజ్ఞప్తి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పవిత్ర రంజాన్‌మాసంలో మాదిరిగానే రంజాన్‌ పండుగ రోజు కూడా ఇండ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ విజ్ఞప్తి చేశారు. రంజాన్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్య లు, ఏర్పాట్లపై డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌భగవత్‌లతో కలిసి లక్డీకపూల్‌లోని తన చాంబర్‌లో మం త్రి సమీక్ష నిర్వహించారు. రంజాన్‌ పండుగరోజూ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టంచేశారు. కర్ఫ్యూవేళల్లో ఎలాంటి మార్పులు లేనందున రంజాన్‌ కొనుగోళ్లను త్వరగా ముగించుకొని రాత్రి ఏడింటిలోపు ఇండ్లకు చేరాలని సూచించారు. రంజాన్‌ పర్వదినం ఆదివారం లేదా సోమవారం జరుపుకోనున్న నేపథ్యంలో ముస్లింలకు ఆయన ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. logo